‘స్వాగ్’ సర్ప్రైజ్ తెలుసా.?
- August 28, 2024
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వాగ్’. ఈ సినిమా మొదటి పోస్టర్ నుంచీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్‌కి వేళయ్యింది. ఈ నెల 29న టీజర్ లాంచింగ్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఈ విషయాన్ని హీరో శ్రీ విష్ణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకూ కొన్ని క్యారెక్టర్లను రివీల్ చేశారు. అలాగే ఓ కాన్సెప్ట్‌తో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగర్ సింగా..’ అనే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.
ఇక, ఇప్పుడు రిలీజ్ చేయబోతున్న టీజర్ వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ఏషియన్ మాల్లో ఈ వేడుకకు రంగం సిద్ధం చేశారు. కుటుంబ సమేతంగా ఈ సినిమాని అన్ని వర్గాల వారూ చూడొచ్చని శ్రీ విష్ణు హింట్ ఇచ్చాడు.
అందుకే టీజర్ లాంఛింగ్‌కి కూడా అందరూ ఆహ్వానితులే అని ఆత్మీయంగా ఆహ్వానించాడు శ్రీవిష్ణు సోషల్ మీడియా వేదికగా.
అంతే కాదండోయ్ ఈ ఈవెంట్‌కి హాజరైన వాళ్లకి ఇంకో సర్ప్రైజ్ కూడా వుందట. అదేంటో అక్కడికి వెళితేనే తెలుస్తుందట. ఆహ్వానం అందింది కదా.! ఆ సర్ప్రైజ్ ఫీల్ ఏంటో మీరూ ఆస్వాదించండి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు