‘స్వాగ్’ సర్‌ప్రైజ్ తెలుసా.?

- August 28, 2024 , by Maagulf
‘స్వాగ్’ సర్‌ప్రైజ్ తెలుసా.?

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వాగ్’. ఈ సినిమా మొదటి పోస్టర్ నుంచీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్‌కి వేళయ్యింది. ఈ నెల 29న టీజర్ లాంచింగ్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈ విషయాన్ని హీరో శ్రీ విష్ణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకూ కొన్ని క్యారెక్టర్లను రివీల్ చేశారు. అలాగే ఓ కాన్సెప్ట్‌తో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగర్ సింగా..’ అనే సాంగ్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.

ఇక, ఇప్పుడు రిలీజ్ చేయబోతున్న టీజర్ వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ఏషియన్ మాల్‌లో ఈ వేడుకకు రంగం సిద్ధం చేశారు. కుటుంబ సమేతంగా ఈ సినిమాని అన్ని వర్గాల వారూ చూడొచ్చని శ్రీ విష్ణు హింట్ ఇచ్చాడు.

అందుకే టీజర్ లాంఛింగ్‌కి కూడా అందరూ ఆహ్వానితులే అని ఆత్మీయంగా ఆహ్వానించాడు శ్రీవిష్ణు సోషల్ మీడియా వేదికగా. 

అంతే కాదండోయ్ ఈ ఈవెంట్‌కి హాజరైన వాళ్లకి  ఇంకో సర్‌ప్రైజ్ కూడా వుందట. అదేంటో అక్కడికి వెళితేనే తెలుస్తుందట. ఆహ్వానం అందింది కదా.! ఆ సర్‌ప్రైజ్ ఫీల్ ఏంటో మీరూ ఆస్వాదించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com