రాయబారులతో ప్రమాణం చేయించిన క్రౌన్ ప్రిన్స్ ..!

- August 28, 2024 , by Maagulf
రాయబారులతో ప్రమాణం చేయించిన క్రౌన్ ప్రిన్స్ ..!

రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ వివిధ దేశాలకు నియమితులైన రాయబారులతో రియాద్‌లో ప్రమాణం చేయించారు.  ఈ కార్యక్రమంలోఒమన్‌కు నియమితులైన రాయబారి ఇబ్రహీం బిన్ సాద్ బిన్ బిషన్, మౌరిటానియా రాయబారి డా. అబ్దుల్ అజీజ్ అల్-రఖాబీ, ఉక్రెయిన్‌కు నియమితులైన రాయబారి మొహమ్మద్ అల్-బరాకా, సైప్రస్‌కు నియమితులైన ఫవాజ్ అల్-షబిలి, కామెరూన్‌కు నియమితులై రాయబారి ఇబ్రహీం అల్-గమ్ది, ఐర్లాండ్‌కు రాయబారిగా నియమితులైన హసన్ అల్-జామీ, సబ్ర్‌కు రాయబారిగా నియమితులైన మాలి అబ్దుల్లా బిన్ సలేహ్ ప్రమాణం చేశారు. విదేశాలలో సౌదీ అరేబియా ప్రయోజనాలను కాపాడతామని, నిజాయితీ, చిత్తశుద్ధితో సేవలు అందిస్తామని రాయబారులు ప్రమాణం చేసారు.  విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కూడా హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com