బి.ఆర్.ఎస్ న్యాయం, ధర్మం గెలుస్తుంది: ఎమ్మెల్సీ కవిత
- August 28, 2024
హైదరాబాద్: ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ బంజరాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవితకు పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానన్న కవిత.. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటాననన్నారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామమన్నారు.
ఇంటికి చేరుకున్న కవితకు నివాసంలో తల్లి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమతో పాటు ఇతర కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. అలాగే, కుటుంబీకులను ఆలింగనం చేసుకొని.. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించారు. రేపు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకొని కేసీఆర్‌తో భేటీ అవుతారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







