దుబాయ్ ప్రమాదం..పిల్లలకు ప్రాణాంతకంగా అక్రమ రవాణా..!

- August 29, 2024 , by Maagulf
దుబాయ్ ప్రమాదం..పిల్లలకు ప్రాణాంతకంగా అక్రమ రవాణా..!

దుబాయ్: డబ్బు ఆదా కోసం అక్రమ రవాణా సేవలను ఉపయోగించకుండా వారి పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యావేత్తలు తల్లిదండ్రులను కోరుతున్నారు. మంగళవారం హట్టా-లహబాబ్ రహదారిపై వాహనం బోల్తా పడిన ఘటనలో దుబాయ్ పాఠశాలకు చెందిన 7 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది గాయపడిన సంఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేశారు.

అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ.. సుశిక్షితులైన సిబ్బంది ఉన్నందున పాఠశాల బస్సులు సేఫ్ అని సిఫార్సు చేస్తామన్నారు. బస్సు సిబ్బంది అందరూ షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA), రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) వంటి నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందారని, భద్రతా ప్రోటోకాల్‌లు ఖచ్చితంగా పాటిస్తారని తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్లకు సరైన శిక్షణ ఉండదని, కొంతమంది డ్రైవర్లు తమ వాహనాల్లో పిల్లలతో కిక్కిరిసి తీసుకుపోతారని తెలిపారు. ఇది ప్రమాదాలకు దారితీస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com