$15 బిలియన్ల రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యం..PIF

- August 29, 2024 , by Maagulf
$15 బిలియన్ల రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యం..PIF

రియాద్: పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) దాని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు మద్దతుగా $15 బిలియన్ల రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయాన్ని పొందింది. కొత్త సదుపాయం మూడేళ్ల కాలానికి ఉద్దేశించారు.మరో రెండు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఐరోపా, యు.ఎస్., మధ్యప్రాచ్యం,  ఆసియా నుండి 23 అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విభిన్న ప్రపంచ సిండికేట్‌తో ఈ మేరకు కుదిరిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.  ఈ ఫైనాన్సింగ్ నిర్ణయం PIF  బలమైన క్రెడిట్ రేటింగ్, దాని సంబంధ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి గణనీయమైన డిమాండ్‌ను తెలియజేస్తుందన్నారు. PIF ఆర్థిక స్థితిపై మూడీస్ నుండి A1 రేటింగ్‌ను మరియు స్థిరమైన ఔట్‌లుక్‌తో ఫిచ్ నుండి A+ రేటింగ్‌ను ప్రకటించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com