బహ్రెయిన్ లో పెరిగిన ఎయిర్ కండీషనర్ దిగుమతులు..!

- August 30, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో పెరిగిన ఎయిర్ కండీషనర్ దిగుమతులు..!

మనామా: బహ్రెయిన్ లో 2024 మొదటి అర్ధ భాగంలో ఎయిర్ కండీషనర్ దిగుమతులలో పెరుగుదలను నమోదైంది. దిగుమతి చేసుకున్న ఎయిర్ కండిషనింగ్ యూనిట్ల సంఖ్య 66,760కి చేరుకుందని అధికారిక డేటా తెలిపింది. 2023 ప్రథమార్థంలో దిగుమతి చేసుకున్న 61,500 యూనిట్లతో పోలిస్తే 8.6% అధికమని వెల్లడించింది. ఎయిర్ కండీషనర్ దిగుమతుల విలువ కూడా 2023లో ఇదే కాలంలో నమోదైన BD7.37 మిలియన్లతో పోలిస్తే 42.1% పెరిగి BD10.47 మిలియన్లకు చేరుకుంది. నివాసితులు వేసవి నెలల్లోనే కాకుండా, ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందేందుకు ఎయిర్ కండీషనర్ల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వాటికి డిమాండ్ పెరుగుతుందని నిపుణులు తెలిపారు.

బహ్రెయిన్‌కు దిగుమతి అవుతున్న ఎయిర్ కండిషనర్ల మొత్తం దిగుమతులలో BD2.23 మిలియన్ల(21.9%) విలువైన దిగుమతులతో చైనా అతిపెద్ద సరఫరా దేశంగా నిలిచింది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) BD1.06 మిలియన్ల(10.2%)తో రెండో స్థానంలో ఉంది. ఇండియా BD1.04 మిలియన్ల(9.9%)తో తర్వాతి స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది.   

సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ (ఫ్రీయాన్)కు అత్యంత డిమాండ్ ఉందని,  మొత్తం దిగుమతుల్లో 43%( BD4.5 మిలియన్) ఇవే ఉన్నాయని డేటా తెలిపింది.  2024లో అత్యధికంగా ఎయిర్ కండీషనర్ దిగుమతి అయిన నెలగా ‘మే’ నిలిచింది. BD2.52 మిలియన్ విలువ కలిగిన 21,346 యూనిట్లు దిగుమతి అయ్యాయి. మొత్తం దిగుమతుల్లో దీని వాటా 24 శాతం కావడం గమనార్హం.  అదే విధంగా జూన్ నెలలో 16,849 యూనిట్లు(BD2.29 మిలియన్ ) దిగుమతి అయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com