జాయింట్ ఫోర్సెస్ కమాండర్‌ను నియమించిన కింగ్ సల్మాన్

- August 30, 2024 , by Maagulf
జాయింట్ ఫోర్సెస్ కమాండర్‌ను నియమించిన కింగ్ సల్మాన్

రియాద్: ఫహద్ అల్-సల్మాన్‌ మేజర్ జనరల్ స్థాయి నుండి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ప్రమోషన్ పొందారు. అతడిని జాయింట్ ఫోర్సెస్ కమాండర్‌గా  రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ నియమించారు. ఈ మేరకు రాయల్ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ ఫోర్సెస్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ముత్లాక్ అల్-అజిమా పదవీ విరమణ పొందారు. అనంతరం మరోక ఉత్తర్వు ద్వారా అతడిని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో రాయల్ కోర్ట్‌కు సలహాదారుగా నియమించారు.  

 నావల్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ అల్-ఘుఫైలీని లెఫ్టినెంట్ జనరల్ హోదాతో జనరల్ స్టాఫ్ యొక్క డిప్యూటీ చీఫ్‌గా నియమించారు.  ల్యాండ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ అల్-ముటైర్‌ను రక్షణ మంత్రి కార్యాలయంలో సలహాదారుగా నియమించారు.  మంత్రుల మండలి సెక్రటేరియట్‌లో సలహాదారుగా ఉన్న సమీర్ అల్-తబీబ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com