హమద్ పోర్ట్ లో 17 కిలోల గంజాయి సీజ్
- August 30, 2024
దోహా: ఖతార్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ), ఖతార్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఇందులో స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నారు. ఎంఓఐ విభాగానికి చెందిన పోలీసు డాగ్ విభాగం మత్తుపదార్థాలను దాచిన ప్రాంతాలను గుర్తించాయి. అనంతరం హమద్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగలు, హస్తకళలు ఉన్నట్లు లేబుల్ చేసిన పార్శిళ్లలో గంజాయిని దాచి తరలించే యత్నం చేశారు. ఎక్స్-రే పరికరాలను ఉపయోగించి చెక్క వస్తువుల లోపల మత్తుపదార్థాలు దాగి ఉంచారు. స్వాధీనం చేసుకున్న పదార్థం మొత్తం బరువు సుమారు 17 కిలోగ్రాములు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..