ఇంజినీరింగ్ కాలేజీ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు..

- August 30, 2024 , by Maagulf
ఇంజినీరింగ్ కాలేజీ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు..

గుడ్లవల్లేరు: కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ (హిడెన్) కెమెరాలో వ్యవహారం కలకలంరేపింది. గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోనళకు దిగారు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. వాష్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థినిల వీడియోలను రికార్డు చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఇదంతా చేస్తున్నాడని.. ఆ వీడియోలను అమ్ముతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అక్కడితో ఆగకుండా అందరూ కలిసి అతడిపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. విద్యార్థినలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

ఈ హిడెన్ కెమెరాల వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్థి ల్యాప్ ట్యాప్, మొబైల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫైనలియర్ విద్యార్థికి.. మరో విద్యార్థిని సహకరిస్తూ వాష్‌రూమ్‌లలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇలా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకూ ఇంజినీరింగ్ కాలేజీలో హైడ్రామా నడిచింది.
ఈ హిడెన్ కెమెరాల విషయాన్ని కొందరు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. గత వారం రోజులుగా కాలేజీలో ఇదంతా జరుగుతోందని.. మేనేజ్‌మెంట్ చర్యలు ఎందుకు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితమే ఈ విషయం బయటపడినా.. కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమంటున్నారు. పోలీసులు ఈ హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నించి, వివరాలు సేకరిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com