తలసేమియా కోసం విజయవంతమైన జన్యు చికిత్స.. వైద్య రంగంలో సౌదీ ఘనత..!

- August 31, 2024 , by Maagulf
తలసేమియా కోసం విజయవంతమైన జన్యు చికిత్స.. వైద్య రంగంలో సౌదీ ఘనత..!

రియాద్: సౌదీ అరేబియా వైద్యపరమైన మరో ఘనతను సాధించింది. రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ (KAMC-RD)  నేషనల్ గార్డ్ హెల్త్ అఫైర్స్ (MNGHA)  CRISPR జన్యు సవరణ సాంకేతికత ద్వారా కాస్గేవీ జన్యు చికిత్సను విజయవంతంగా ఉపయోగించి 13 మందికి చికిత్స నిర్వహించింది. ఈ విజయం క్లినికల్ ట్రయల్స్ మరియు పరిశోధనల అధునాతన జన్యు చికిత్స పురోగతి ని సాధించింది. పుట్టినప్పటి నుండి ప్రతి మూడు వారాలకు ఒకసారి రక్తమార్పిడిపై ఆధారపడే యువ రోగి, విజయవంతమైన జన్యు కణ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. సౌదీ అరేబియా ఈ అధునాతన జన్యు చికిత్సలను సికిల్ సెల్ అనీమియా, తలసేమియాతో బాధపడుతున్న మరింత మంది రోగులకు విస్తరించడానికి సిద్ధమవుతోంది. ప్రపంచ స్థాయిలో జన్యు చికిత్స రంగంలో సౌదీ మరింతగా పురోగతి సాధించిందని వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com