ఏపీలో భారీ వర్షాలు..ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్లను వాడాలి: సీఎం ఆదేశాలు

- August 31, 2024 , by Maagulf
ఏపీలో భారీ వర్షాలు..ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్లను వాడాలి: సీఎం ఆదేశాలు

అమరావతి: విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారయంత్రాంగంతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు.

వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా పరిస్థితికి అనుగుణంగా దారి మళ్లించాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలకు టెక్నాలజీ వాడుకోవాలని, వాట్సాప్ గ్రూపులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్లను ఉపయోగించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com