యూఏఈలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

- August 31, 2024 , by Maagulf
యూఏఈలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ సెప్టెంబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.  ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఇంధన ధరలు ప్రతి నెలా చమురు ప్రపంచ ధరల ప్రకారం నిర్ణయిస్తుంది. ఇంధన ధరల పర్యవేక్షణ కమిటీ ఆగస్టులో ధరలతో పోల్చితే లీటరుకు 15 ఫిల్స్‌ చొప్పున తగ్గించింది. కొత్త రేట్లు ఈ  విధంగా ఉన్నాయి.

-సూపర్ 98 పెట్రోల్ ధర ఆగస్టులో 3.05 దిర్హాంలు ఉండగా..ఇప్పుడు లీటరుకు 2.90 దిర్హాంలు అవుతుంది.

-ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.78 అయింది.  ప్రస్తుత దీని ధర Dh2.93గా ఉంది. 

- E-Plus 91 పెట్రోల్ ధర ఆగస్టులో Dh2.86గా ఉండగా, ఇప్పుడు లీటరుకు 2.71 దిర్హాలు అవుతుంది.

-ప్రస్తుతం డీజిల్ ధర 2.95 దిర్హాం కాగా, దానిని 2.78 దిర్హామ్‌లకు తగ్గించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com