అమ్మో ప్రబాస్.! అస్సలు రెస్టే లేదుగా.!

- August 31, 2024 , by Maagulf
అమ్మో ప్రబాస్.! అస్సలు రెస్టే లేదుగా.!

వరుస పరాజయాలతో సతమతమైన ప్రబాస్ ‘కల్కి’ సినిమాతో ఊరట పొందాడు. అలాగే ఫ్యాన్స్‌లోనూ ఉత్సాహాన్ని నింపాడు. ఇదే జోరుతో వరుసగా సినిమాలు కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు. మూడు నుంచి నాలుగు ప్రాజెక్లుల వరకూ ఓకే చేసి వుంచడంతో పాటూ సైమల్టేనియస్‌గా పూర్తి చేసేస్తున్నాడు కూడా.
‘రాజా సాబ్’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శరవేగంగా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అలాగే, ‘సలార్ 2’ షూటింగ్‌లోనూ ప్రబాస్ పాల్గొంటున్నాడు. మరోవైపు ‘స్పిరిట్’ కూడా రేపో మాపో పట్టాలెక్కేందుకు సిద్ధంగా వుంది.
ఇక లేటెస్ట్‌గా ‘కల్కి 2’ కూడా ఆన్ సెట్స్‌కి సిద్ధమవుతున్నట్లు స్వయంగా నిర్మాతలే క్లారిటీ ఇచ్చేశారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా మూవీ ‘కల్కి’ ఇటీవల 1100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా ప్యాన్ ఇండియా వైడ్ ప్రసిద్ధికెక్కింది.
ఇక, ఈ సినిమాకి సీక్వెల్ కూడా మరో నాలుగు నెలల్లో అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ చేయనున్నట్లు నిర్మాతలు స్వప్నాదత్ అండ్ టీమ్ తెలిపారు. రష్యాలో జరుగుతున్న ఓ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరైన స్వప్న దత్ ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. అలాగే, ఈ సినిమాని త్వరలోనే రష్యాలో కూడా రిలీజ్ చేయబోతున్నామని వారు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com