‘మత్తు వదలరా 2’.! హిలేరియస్ హిట్ అవుతుందా.?

- August 31, 2024 , by Maagulf
‘మత్తు వదలరా 2’.! హిలేరియస్ హిట్ అవుతుందా.?

అప్పుడెప్పుడో వచ్చిన రాజమౌళి వారసుడు శ్రీ సింహా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా ఇండస్ట్రీ నోటిలో నానింది.
ఇప్పుడా సినిమాకి సీక్వెల్ రూపొందించారు. అదే ‘మత్తు వదలరా 2’. హిలేరియస్ కామెడీగా రూపొందిన ‘మత్తు వదలరా’ సినిమా అప్పట్లో యూత్‌ని బాగా అలరించింది.
అందుకు ఏమాత్రం తగ్గకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించినట్లు తాజా ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అంతకు మించి అనే రేంజ్‌లో హిలేరియస్‌గా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. శ్రీ సింహాతో పాటూ, కమెడియన్ సత్య ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.
వీరిద్దరి కాంబినేషన్‌తో పాటూ పొడుగు సుందరి ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ పోషించింది. హీరోకి ధీటుగా.. కాదు కాదు, హీరో కన్నా ఎక్కువే పర్‌పామెన్స్ చేసేసినట్లుంది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేస్తోంది.
 అందంగా కనిపిస్తూనే కామెడీ కూడా ఇరగదీసినట్లుంది. అంతే కాదు, ఈ సినిమాలో ఓ పాటను తానే స్వయంగా రాసి పాడుకున్నానని చెబుతోంది ఫరియా అబ్ధుల్లా.
సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌ని రితేష్ రానా తెరకెక్కించగా,  మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com