యూఏఈలో స్వల్ప భూకంపం..భయంతో వణికిన ప్రజలు..!
- September 01, 2024
యూఏఈ: ఆదివారం యూఏఈలో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది. నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ స్టేషన్లు మసాఫీలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. యూఏఈ కాలమానం ప్రకారం.. ఉదయం 7.53 గంటలకు మసాఫీలో భూకంపం నమోదైంది. 1.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూకంపం నుండి ప్రకంపనలను అనుభవించినట్లు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, భూకంపం యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని NCM తెలిపింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







