వీసా క్షమాభిక్ష: అబుదాబిలో ఆరోగ్య బీమా జరిమానాలు మాఫీ..

- September 01, 2024 , by Maagulf
వీసా క్షమాభిక్ష: అబుదాబిలో ఆరోగ్య బీమా జరిమానాలు మాఫీ..

యూఏఈ: తమ స్టేటస్‌ను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న ఎంట్రీ,  రెసిడెన్స్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరోగ్య బీమా జరిమానాలు మినహాయించబడతాయని అబుదాబి ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు నెలల యూఏఈ వీసా క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబర్ 1న ప్రారంభం అయింది. యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారు తమ రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించవచ్చు. జరిమానాలను చెల్లించకుండా దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు.  ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) గతంలో ఎలాంటి ఓవర్‌స్టే జరిమానా లేదా ఎగ్జిట్ రుసుము వసూలు చేయడం లేదని ప్రకటించింది. దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడే వారికి మళ్లీ ప్రవేశ నిషేధం ఉండదు. వారు సరైన వీసాతో ఎప్పుడైనా యూఏఈకి తిరిగి రావచ్చని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com