57 మంది బంగ్లాదేశీయులకు ఊరట.. శిక్షలు ఎత్తివేత.. యూఏఈ అధ్యక్షుడు ఆదేశాలు..!
- September 03, 2024
యూఏఈ: ఎమిరేట్స్లో గత నెలలో నిరసనలలో పాల్గొన్న బంగ్లాదేశ్ పౌరులకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ క్షమాపణ ప్రసాదించారు. దోషులపై శిక్షలను ఎత్తివేయాలని వారిని దేశం నుండి బహిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రెసిడెంట్ ఆదేశాలతో యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ అల్ షమ్సీ.. శిక్షల అమలును నిలిపివేయాలని, బహిష్కరణ ప్రక్రియలను ప్రారంభించాలని ఉత్తర్వు జారీ చేశారు.
అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూఏఈలో ఉన్న బంగ్లా దేశీయులు నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలకు పిలుపునిచ్చినందుకు అల్లర్లను ప్రేరేపించినందుకు అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జూలై 22న ముగ్గురు బంగ్లాదేశీయులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి సమావేశంలో పాల్గొన్నందుకు మరో 53 మందికి 10 ఏళ్ల శిక్ష, ఒక నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..