నిహారిక ఖాతాలో మరో హిట్ రెడీ అయిపోతోందిగా.!
- September 03, 2024
హీరోయిన్‌గా ఫెయిలైనా నిర్మాతగా మంచి కంటెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇటీవలే ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో చిన్న సినిమాల్లో పెద్ద హిట్ కొట్టింది.
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో రాబోతోంది. అయితే ఈ సారి రాబోయేది సినిమా కాదు. వెబ్ సిరీస్. ‘బెంచ్ లైఫ్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సిరీస్ ఈ నెల 12 నుంచి సోనీ లివ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్‌కి మానసా శర్మ దర్శకత్వం వహించగా, నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించారు. ఐటీ ఉద్యోగుల జీవితాల్లోని కష్ట నష్టాల్ని రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
ఎక్కువ శాతం వినోదం మేలవింపుతో పాటూ, అక్కడక్కడా కొన్ని ఎమోషన్లు కూడా ట్రైలర్‌లో కట్ చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. చూస్తుంటే, నిర్మాతగా నిహారికకు ఈ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రశంసలు దక్కేలా అనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …