భూమి వాతావరణంలో పూర్తిగా మండిపోయిన గ్రహశకలం..!

- September 06, 2024 , by Maagulf
భూమి వాతావరణంలో పూర్తిగా మండిపోయిన గ్రహశకలం..!

మస్కట్: ఇటీవల గుర్తించిన గ్రహశకలం 2024 ఆర్‌డబ్ల్యూ1 భూమి వాతావరణం గుండా వెళుతుండగా పూర్తిగా మండిపోయిందని ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ధృవీకరించింది. గ్రహశకలం చిన్నదని, భూమి ఉపరితలంపై ఎటువంటి ప్రమాదం లేదని ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఇషాక్ బిన్ యాహ్యా అల్-షుయైలీ తెలిపారు. ఈ గ్రహశకలం భూమికి చేరుకోవడానికి కొన్ని గంటల ముందు అరిజోనా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కాటాలినా స్కై సర్వే ప్రాజెక్ట్ ద్వారా గుర్తించినట్లు వివరించారు. సెకనుకు 17 కిలోమీటర్ల వేగంతో గురువారం తెల్లవారుజామున ఫిలిప్పీన్స్‌కు ఉత్తరాన ఉన్న లుజోన్ ద్వీపం సమీపంలో భూమిని ఢీకొనే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు.  గ్రహశకలం పరిమాణం దాదాపు 1.5 మీటర్లు ఉంటుందని, ఇది చాలా చిన్నదని, దీని వల్ల భూమికి పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయని, ఆందోళన అవసరం లేదని ఆయన సూచించారు. వందల మీటర్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన పెద్ద వస్తువులతో ప్రమాదం ఉంటుందని అల్-షైలీ చెప్పారు. 2022లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ప్రయోగించిన ‘డార్ట్’ అంతరిక్ష నౌకను ఢీకొని చిన్న చంద్రుడిగా భావిస్తున్న ‘డైమోర్ఫోస్’ మార్గాన్ని మార్చి శాస్త్రవేత్తలు సాధించిన విజయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ విజయం భూమికి ప్రమాదం కలిగించే పెద్ద వస్తువులను ఎదుర్కోనే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com