అబుదాబిలో పెళ్లికి కొత్త కండిషన్లు.. ఆ పరీక్ష తప్పనిసరి..!!

- September 11, 2024 , by Maagulf
అబుదాబిలో పెళ్లికి కొత్త కండిషన్లు.. ఆ పరీక్ష తప్పనిసరి..!!

యూఏఈ: అబుదాబిలో వివాహం చేసుకునే పౌరులు వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇది తప్పనిసరి అని ఎమిరేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. పరీక్ష ఫలితాలు వచ్చేందుకు 14 రోజులు పడుతుందని పేర్కొంది. 2022 నుండి 800 జంటలకు పరీక్షలు నిర్వహించగా.. 86 శాతం మంది విజయవంతంగా జన్యు అనుకూలత ఫలితాలు వచ్చాయని, 14 శాతం మందికి మాత్రమే జన్యు ఫలితాల ఆధారంగా తగిన కుటుంబ నియంత్రణ ప్రణాళిక అవసరమని తేలిందని పేర్కొన్నారు.   అబుదాబి, అల్ దఫ్రా, అల్ ఐన్‌లోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జన్యు పరీక్ష, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.  జన్యు ఉత్పరివర్తనల ప్రభావం పిల్లలపై ఉంటుందని, వారిలో దృష్టి, వినికిడి లోపం, రక్తం గడ్డకట్టడం, అభివృద్ధి ఆలస్యం, అవయవ వైఫల్యం, హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన మూర్ఛలువంటి పరిస్థితులకు దారి తీయవచ్చని హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com