యూఏఈలో ఎయిర్ టాక్సీలు.. మొదటి కంపెనీగా నిలిచిన జాబీ ఏవియేషన్..!

- September 11, 2024 , by Maagulf
యూఏఈలో ఎయిర్ టాక్సీలు.. మొదటి కంపెనీగా నిలిచిన జాబీ ఏవియేషన్..!

యూఏఈ: యూఏఈలో మొదటి సర్టిఫైడ్ ఎయిర్ టాక్సీ ఆపరేటర్‌గా దరఖాస్తు చేసుకున్నట్లు యుఎస్ ఆధారిత కంపెనీ జాబీ ఏవియేషన్ ప్రకటించింది. ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ అనేది ఎమిరేట్స్ లో వాణిజ్య విమాన రవాణాను నిర్వహించడానికి యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) జారీ చేసే సర్టిఫికేట్. ఈ వారం కెనడాలోని మాంట్రియల్‌లో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ప్రారంభ అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ సమ్మిట్‌లో జాబీ దరఖాస్తు చేసినట్టు జోబీ ఏవియేషన్ వ్యవస్థాపకుడు, CEO జోబెన్ బెవిర్ట్ వెల్లడించారు. ఈ మేరకు GCAA డైరెక్టర్ జనరల్ సైఫ్ మొహమ్మద్ అల్ సువైదీని కలిసి దరఖాస్తు అందజేసినట్లు తెలిపారు. 

మే 2022లో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుండి యూఎస్ పార్ట్ 135 ఎయిర్ క్యారియర్ సర్టిఫికేట్‌ను అందుకుంది జాబీ. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులను గంటకు 200 మైళ్ల వేగంతో తీసుకువెళ్లేలా రూపొందించారు.  దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పామ్ జుమేరాకు మొదటి దశలో ప్రయాణించనున్నారు. ఈ దూరానికి సాధారణంగా కారులో 45 నిమిషాలు పడుతుండగా.. అది 10కి తగ్గిపోనుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలోఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA)తో జాబి ఒక ఒప్పందాన్ని కుదరుర్చుకుంది. దీని తర్వాత ఏప్రిల్‌లో మునిసిపాలిటీలు, రవాణా శాఖ - అబుదాబి (DMT), అబుదాబి ఆర్థికాభివృద్ధి శాఖ (DED), సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ - అబుదాబి (DCT)లతో అవగాహన ఒప్పందాలను చేసుకుంది.  

ఇదిలావుండగా, వచ్చే ఏడాది ఎయిర్ టాక్సీలను ప్రారంభించేందుకు సన్నాహకంగా 'మిడ్‌నైట్‌'లో 400కు పైగా టెస్ట్‌ ఫ్లైట్‌లను అమెరికాకు చెందిన మరో విమాన రవాణా సంస్థ ఆర్చర్ ఏవియేషన్ నిర్వహించింది. మొదటి ఎనిమిది నెలల్లో 402 పరీక్షలను నిర్వహించి, 2024కి నిర్ణయించిన షెడ్యూల్ కంటే నాలుగు నెలల ముందే టెస్టింగ్ ప్రక్రియను ముగించింది.  2025లో యూఏఈలో ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com