ఇన్వెస్టర్లకు పెద్దపీట.. పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా ఒమన్..!!

- September 11, 2024 , by Maagulf
ఇన్వెస్టర్లకు పెద్దపీట.. పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా ఒమన్..!!

మస్కట్: ఒమన్ విదేశీ పెట్టుబడిదారులకు బలమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారే మార్గంలో ఉంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల మార్కెట్‌లలో ఒమన్ కు 59 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.  ఇది ఆసియా, ఆఫ్రికాలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లకు ఆకర్షణీయంగా మారనుంది.  మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీలు కూడా ఒమన్ మార్కెట్ 'స్థిరంగా' ఉంటుందని రేటింగ్ ఇచ్చాయి. పెట్టుబడిదారులకు అనుకూల చట్టాలు, GDP వృద్ధి రేటుతో ఆర్థిక స్థిరత్వంతో ఒమన్ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. 

ఈ క్రమంలో అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఒమన్ కుదుర్చుకుంది. సింగపూర్, స్విట్జర్లాండ్ ఇటీవలి FTAలు సమీప భవిష్యత్తులో వాణిజ్య అవకాశాలను మరింత మెరుగుపరుస్తాయి అని భావిస్తున్నారు.  పెట్టుబడుల పరిమాణంపై ఆధారపడి పెట్టుబడిదారులకు 5 నుంచి 10 సంవత్సరాల రెసిడెన్సీ అనుమతులను పొందవచ్చు. ముంబైలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలోని పరిశ్రమ విశ్లేషణ విభాగం అధిపతి అబ్దుల్లా అల్ రవాహి తెలిపారు. బలమైన మౌలిక సదుపాయాలు, దుక్మ్, సలాలా, సోహర్ వంటి వ్యూహాత్మక ఓడరేవులు.. ఒమన్ లాజిస్టిక్స్ హబ్‌గా మారేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని అబ్దుల్లా అల్ రవాహి అన్నారు. “పెద్ద ఎత్తున పెట్టుబడి అవకాశాలను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని రూపొందించింది. పెట్టుబడిదారులకు వన్-స్టాప్ షాప్ అందించడానికి 15 ప్రభుత్వ సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు.’’ అని అబ్దుల్లా అల్ రవాహి తెలిపారు.

ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ఒమన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఫ్యూచర్ జనరేషన్స్ ఫండ్ సహాయంతో పెట్టుబడిదారులకు ఆర్థిక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విదేశీ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చట్టం, దివాలా చట్టం, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య చట్టం వంటి కొన్ని చట్టాలను కొత్తగా తీసుకొచ్చారు. ప్రైవేటీకరణ చట్టం, వాణిజ్య కంపెనీల చట్టం అన్నీ పెట్టుబడులను సృష్టించేందుకు రూపొందించబడ్డాయని వివరించారు. 100 శాతం వరకు విదేశీ యాజమాన్యం, 30 సంవత్సరాల వరకు పన్ను మినహాయింపు, భూమి కేటాయింపు, కస్టమ్స్ సుంకం మినహాయింపులు, ఇంటిగ్రేటెడ్ ఇ-సేవలు, 10 సంవత్సరాల వరకు పెట్టుబడిదారులకు రెసిడెన్సీ సహా అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com