ఎయిర్ టెల్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ సేవలు
- September 11, 2024
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలను ప్రారంభించింది. ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ డిజిటల్ విభాగం ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఈ ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఇకపై ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయొచ్చని, గరిష్ఠంగా ఏడాదికి 9.1 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలకోసం ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలతో ఎయిర్‌టెల్ టైఅప్ అయింది. కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరవకుండానే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ బుక్ చేయొచ్చు. కావాలంటే వారం తర్వాత ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉందని ఎయిర్‌టెల్ తెలిపింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఫైనాన్స్.. ఫ్లెక్సీ పర్సనల్ లోన్స్, కో బ్రాండ్ క్రెడిట్ కార్డుులు, కో బ్రాండ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్, గోల్డ్ లోన్లను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ద్వారా అందిస్తోంది. తొందరలో బిజినెస్, సెక్యూర్డ్ లోన్లను కూడా అందించనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..