మరోసారి భారత్‌లో పర్యటించన్ను మాల్దీవుల అధ్యక్షుడు ముయుజ్జు

- September 11, 2024 , by Maagulf
మరోసారి భారత్‌లో పర్యటించన్ను మాల్దీవుల అధ్యక్షుడు ముయుజ్జు

న్యూఢిల్లీ: మరోసారి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయుజ్జు అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నట్లు అక్కడి అధ్యక్ష భవనం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత.. ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి. అంతకుముందు ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన అధికారికంగా పర్యటించనున్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ పర్యటనకు సంబంధించిన కచ్చితమైన తేదీని వెల్లడించలేదు.

చైనా అనుకూలుడిగా పేరున్న ముయుజ్జు.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదివరకటి అధ్యక్షుల్లా కాకుండా తన మొదటి పర్యటన తుర్కియే, చైనాలో జరిపారు. భారత్‌ బలగాలు మాల్దీవులను విడిచివెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మోడీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యటించిన సమయంలో.. కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దూరం మరింత పెరిగింది. దాంతో సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ పేరిట హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది. ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవులు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై వేటు వేసింది.

ఇక, మూడోసారి భారత ప్రధానిగా జూన్‌ 9న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముయుజ్జు హాజరయ్యారు. ఇటీవల భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ సైతం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com