సింగపూర్ లో వైభవంగా వినాయకచవితి వేడుకలు

- September 11, 2024 , by Maagulf
సింగపూర్ లో వైభవంగా వినాయకచవితి వేడుకలు

సింగపూర్: ప్రపంచవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో భాద్రపద శుక్ల చవితిని పురస్కరించుకుని జరుపుకునే వినాయక చవితి పండుగను ఈ ఏడాది కూడా సింగపూర్‌లోని తెలుగు వారు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కిండల్ కిడ్స్ పాఠశాల సభామందిరంలో  సశాస్త్రీయంగా కల్పోక్తరీతిలో ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన ఈ పూజ కార్యక్రమంలో వినాయక షోడషోపచార, ఏకవింశతి, దూర్వాయుగ్మ, అష్టోత్తర శతనామావళి పూజలతో పాటు , వినాయకోత్పత్తి, శమంతకమణోపాఖ్యానం వంటి కథా శ్రవణాలతో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. సుస్మిత కొల్లి అందర్నీ ఆకట్టుకునేలా పూజా వేదికను అలంకరణ చేశారు. విద్యార్థి బృందం దేవుని పాటలతో అందరినీ అలరించింది. పూజ అనంతరం అందరికీ ప్రసాద వితరణ జరిగింది. గణపతి లడ్డూ వేలంలో లక్ష్మి మరియు కరణ్ దంపతులు  లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమం చివరగా నిమజ్జనంతో ముగిసింది. 

కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి సుప్రియ మాట్లాడుతూ, పూజలో పాల్గొన్న పిల్లలు, ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు మరియు పెద్దలు ప్రత్యక్షంగా పాల్గొని భక్తి మరియు శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాకుండా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా 7,500 మందికి పైగా వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.

తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం దైవసంకల్పం అని, ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రకృతి విపత్తుల నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రధానంగా సహకరించిన కిండల్ కిడ్స్ పాఠశాల యాజమాన్యానికి, విగ్రహ దాతలు పుట్టి ప్రసాద్, ముద్దం విజ్జేందర్, తాటిపల్లి విజయబాబు, కొత్తమాసు రాజశేఖర్ కు, పూజారి శ్రవణ్ బల్కి కి, ప్రసాదాలు అందించడానికి సహకరించిన దాతలకు, కమిటీ సభ్యులకు,సేవాదళ కార్యకర్తలకు గౌరవ కార్యదర్శి అనిల్ కుమారి పోలిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com