హైదరాబాద్ లో రేవ్ పార్టీ భగ్నం...
- September 11, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో నగరంలోని గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.గెస్ట్ హౌస్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన పార్టీకి సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తులు హాజరైనట్లు సమాచారం. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ పార్టీలో గంజాయి, ఈ సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించినట్లు తెలుస్తోంది.
పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు.. మొత్తం 18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 45 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆపై వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!







