సీఎం రిలీఫ్ ఫండ్‌కు తెలంగాణ పోలీసుశాఖ భారీ విరాళం
- September 11, 2024
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కూడా తమ ఒకరోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దీని తాలూకు రూ.11,06,83,571 చెక్కును పోలీసు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి చేతికి అందజేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి డీజీపీ జితేందర్ తెలంగాణ పోలీసుల తరఫున చెక్‌ను అందించడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..