భాగ్యనగరంలో జరగనున్న 12వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు

- September 11, 2024 , by Maagulf
భాగ్యనగరంలో జరగనున్న 12వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు

చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి తెలుగు భాష, సాహిత్య, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని నేటి యువతరానికి, భావితరాలకు అందించటానికి తగిన చర్చలు, సమాలోచనలు, కళాప్రదర్శనలు నిర్వహిస్తూ-తెలుగువారిలో సృజనాత్మకత, పరస్పర సహకారభావం పెంపొందేలా ఒక విశ్వవేదికను కల్పిస్తూ, విశ్వవ్యాప్తంగా తెలుగుజాతి వ్యాపారాభివృద్ధికి తద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ, “సంఘీభావమే బలం” అన్న నినాదంతో నిరంతరం తెలుగువారి పురోగతికి పాటుపడుతున్న విశ్వవ్యాప్త తెలుగుజాతి సమైక్య వేదిక "ప్రపంచ తెలుగు సమాఖ్య". 

లాభాపేక్ష లేని, రాజకీయేతర సాంఘిక సేవాసంస్థగా ప్రపంచ తెలుగు సమాఖ్య 30 ఏళ్లుగా ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న తెలుగువారి మధ్య సంఘీభావాన్ని పెంపొందించడానికి, ఘనమైన మన వారసత్వం తెలుగుభాషా సాహిత్యాలు, సాంప్రదాయక, ఆధునిక కళలు క్షీణించిపోకుండా పదిల పరిచి భావితరాలవారికి అందించాలన్న సదాశయంతో సమాఖ్య కృషి చేస్తుంది. 

గత మూడు దశాబ్దాలుగా రెండేళ్ళకొకసారి అంతర్జాతీయ మహాసభలద్వారాను, సభలు, సమావేశాల ద్వారాను విద్వద్దోష్టుల పరంగాను తన సేవా ధర్మాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. ఇంతవరకూ 11 అంతర్జాతీయ మహాసభలు చెన్నపురి, హైదరాబాద్, ఢిల్లీ, విశాఖపట్నం, సింగపూరు, బెంగుళూరు, దుబాయ్, విజయవాడ, మలేసియాలలో మరల 2018లో చెన్నైలో జరిగాయి. 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను 2025, జనవరి 3, 4, 5 తేదీల్లో హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ వద్ద ఉన్న “నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్" & HICC కాంప్లెక్స్ వేదికలో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి డా.వి.ఎల్.ఇందిరాదత్ తెలిపారు. 

ఈ మూడు రోజుల సభలలో కవితా గోష్టులు, కళారూపక ప్రదర్శనలు, వ్యాపార సదస్సులు, నృత్య, సంగీత, సాహితీ కార్యక్రమాలు మరియు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి. ఆయా రంగాలలో నిష్ణాతులైన విశిష్ట వ్యక్తులు పాల్గొనబోతున్నారు. ఆసక్తి ఉన్న వారందరూ మహాసభ ప్రతినిధులుగా, సభలలో పాల్గొనే వారు సభ్యత్వం నమోదు చేసికొని ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభల ఘనవిజయానికి తోడ్పడాలని శ్రీమతి దత్ కోరారు. 

ప్రతినిధులుగా నమోదు చేసుకునేందుకు, కింది లింక్ క్లిక్ చేయండి:  

https://docs.google.com/ forms/d/e/1FAIpQLSf-DjjVLa5vUusuK3kYEHHJu4lXqRu01FZY7onurMsfvw14iA/viewform?usp=sf_link


సభ్యత్వ నమోదు చేసుకునేందుకు, కింది లింక్ క్లిక్ చేయండి: 

https://docs.google.com/forms/d/e/ 1FAIpQLSf5Uu4EdOXzQOrsVhJVLptvwSyfMckFQ1RlI_Rh_0VGfV7vKw/viewform?usp=sf_link

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com