సంయుక్త మీనన్ కొత్త లుక్ చూశారా.?

- September 11, 2024 , by Maagulf
సంయుక్త మీనన్ కొత్త లుక్ చూశారా.?

స్టార్ హీరోయిన్ హోదాని ఈజీగా అందుకోగలిగే సత్తా వున్న ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. కానీ, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తెలుగులో ఇంతవరకూ చేసిన సినిమాలన్నీ సంయుక్తకు సక్సెస్‌లుగానే నిలిచాయ్.

త్వరలోనే శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న శర్వా 37లో సంయుక్త హీరోయిన్‌‌గా నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి సంయుక్త మీనన్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ లుక్‌లో సంయుక్త మీనన్ భరత నాట్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్లాసికల్ డాన్సర్ దుస్తుల్లో సంయుక్త మీనన్ హావ భావాలు అభిమానుల్ని ఉవ్విళ్లూరిస్తున్నాయ్. బ్యాక్ గ్రౌండ్‌లో దీపాల నడుమ సంయుక్తం అచ్చమైన సాంప్రదాయ అంద చందాలు మిరుమిట్లుగొలిపేలా కనిపిస్తున్నాయ్.

ఈ సినిమాని ‘సామజవరగమన’ ఫేమ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. సాక్షి వైద్య, సంయుక్తా మీనన్.. శర్వానంద్‌తో జోడీ కడుతున్నారు. ఓ డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

అంతేకాదు హై టెక్నికల్ వేల్యూస్ ఈ సినిమాలో వుండబోతున్నాయనీ తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న  ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అనిల్ సుంకర, రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com