గోధుమలతో ఇన్ని లాభాలా.?
- September 11, 2024
ఈజీగా బరువు తగ్గాలనుకునేవాళ్లు బియ్యానికి బదులు గోధుమల్ని డైట్‌లో యూజ్ చేస్తే ఖచ్చితంగా లాభాలుంటాయ్.
గోధుమల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా వుంటుంది. ఇది తక్కువ కంటెంట్ తీసుకున్నప్పటికీ ఎక్కవ శక్తినివ్వడంలో తోడ్పడుతుంది. తద్వారా తొందరగా బరువు తగ్గే అవకాశముంటుంది.
అలాగే, బియ్యంతో పోల్చితే, గోధుమ రవ్వ, గోధుమ పిండితో చేసిన రోటీలు గట్రా ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.
గోధుమల్లోని ఫైబర్ జీర్ణశక్తని మెరుగు పరుస్తుంది. తద్వారా మలబద్ధకం సమస్యలు తీరిపోతాయ్. హృద్రోగాలున్నవారు సైతం గోధుమలను తమ డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్‌లో వుంచుతుంది. అందుకే హార్ట్‌కి సంబంధించిన సమస్యలున్నవాళ్లు ఖచ్చితంగా గోధుమలతో చేసిన వంటకాల్ని తినాలని చెబుతున్నారు.
గోధుమల్లోని విటమిన్ ఎ, మెగ్నీషియం కూడా ఎక్కువగా వుండడంతో ఎముకలు ధృడంగా అవ్వడానికి తోడ్పడుతుంది. గోధుమ పిండితో చేసిన వంటకాల్ని రెగ్యులర్‌గా తినే వారికి ఎలాంటి స్కిన్ డిసీజెస్ రావనీ, చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ వుంటుందనీ తాజా సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!