కువైట్ ఎయిర్‌పోర్ట్.. ‘స్మార్ట్’గా T2 టెర్మినల్..గడువులోగా పూర్తి..!!

- September 12, 2024 , by Maagulf
కువైట్ ఎయిర్‌పోర్ట్.. ‘స్మార్ట్’గా T2 టెర్మినల్..గడువులోగా పూర్తి..!!

కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ T2 ప్యాసింజర్స్ టెర్మినల్ అత్యాధునిక "స్మార్ట్"గా రూపొందనుంది. ప్రస్తుతం జరుగుతున్న మెగా డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నట్టు ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా తెలిపారు. కొత్త ప్రాజెక్ట్ ఆవరణలో జరిగిన క్యాబినెట్ వీక్లీ సమావేశంలో ప్రాజెక్ట అమలుపై సమీక్ష నిర్వహించారు.  అనంతరం  టెర్మినల్ సైట్‌ను పరిశీలించారు. ప్రాజెక్ట్ అమలును స్వయంగా పరిశీలించి, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖతో సహకరించాలని సంబంధిత ప్రభుత్వ సంస్థలను ఆదేశించింది.  T2 అనేది ఆధునిక మరియు అత్యాధునిక "స్మార్ట్" ప్రాజెక్ట్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపారు. కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చీఫ్ షేక్ హుమూద్ ముబారక్ అల్-హుమూద్ అల్-జాబర్ అల్-సబా ప్రాజెక్ట్‌ పురోగతిని తెలిపే ప్రదర్శనను ప్రారంభించారు.  ఈ కీలకమైన ప్రాజెక్ట్‌ని నిర్ణీత గడువులోపు పూర్తి చేయడానికి కృషి చేస్తున్న సంబంధిత ప్రభుత్వ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com