ధరల్లో తేడా..6 జిప్సం కంపెనీలకు SR 91 మిలియన్ జరిమానాలు..!!

- September 12, 2024 , by Maagulf
ధరల్లో తేడా..6 జిప్సం కంపెనీలకు SR 91 మిలియన్ జరిమానాలు..!!

రియాద్:  ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆరు జిప్సం కంపెనీలకు సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ భారీ జరిమానాలను విధించింది. కాంపిటీటివ్ చట్టాన్ని ఉల్లంఘించి ధరలను నిర్ణయించారని పేర్కొంటూ ఈ కంపెనీలపై మొత్తం SR91.1 మిలియన్ జరిమానాలు విధించినట్టు అథారిటీ వెల్లడించింది.  వీటిలో రెండు కంపెనీలు సౌదీ తడావుల్ స్టాక్ మార్కెట్, నోము సమాంతర స్టాక్ మార్కెట్‌లో లీస్ట్ అయ్యాయి. కంపెనీలు తమ స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ఈ విషయాన్నిప్రచురించాలని ఆదేశించింది.

ఈ కంపెనీలపై విధించిన జరిమానా మొత్తం ఈ విధంగా ఉంది: SR10.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ; SR14.4 మిలియన్ — యునైటెడ్ మైనింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ; SR23.4 మిలియన్ — అల్-ఖాయత్ జిప్సం కంపెనీ; SR19.9 మిలియన్ — మడా జిప్సమ్ లిమిటెడ్; SR 19 మిలియన్ — ASK జిప్సం ఫ్యాక్టరీ లిమిటెడ్; SR 3.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com