ఫిలిప్పీన్స్‌లో 100 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. యూఏఈలో నిందితుడు అరెస్ట్..!!
- September 12, 2024
యూఏఈ: ఫిలిప్పీన్స్‌లో 100 మందికి పైగా పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ వ్యక్తిని యూఏఈలో అరెస్టు చేశారు. నిందితుడిని అప్పగించమని యూఏఈని కోరినట్టు అధికారిక పర్యటన కోసం ఇక్కడకు వచ్చిన ఫిలిప్పీన్స్ అంతర్గత హోం శాఖ (DILG) కార్యదర్శి బెంజమిన్ 'బెన్‌హూర్' అబాలోస్ జూనియర్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలోక వెల్లడించారు. దుబాయ్‌లో ఫిలిపినో కమ్యూనిటీతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం బలమైన పోరాటంలో ఇది భారీ ముందడుగుగా పేర్కొన్నారు. నిందితుడు బాధితుల ఫోటోలు, వీడియోలను విదేశీయులకు విక్రయించి, ఆన్‌లైన్‌లో డబ్బులను అందుకునేవాడు. ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ నోటీసు జారీ తర్వాత యూఏఈలో అతడిని అరెస్టు చేశారు. అయితే, అరెస్ట్‌పై యూఏఈ అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







