సీఎం రేవంత్ రెడ్డితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ
- September 12, 2024
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకేసీ) డానియెలా కాంబ్ (Daniela Combe)మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సదస్సు #GlobalAISummit2024 ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ ఆసక్తి కనబరిచారు.
ఈ సమావేశంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.
--వేణు పెరుమాళ్ల✍🏼(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







