రష్యా ప్రధాని పుతిన్ తో భారత్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముఖాముఖి..

- September 12, 2024 , by Maagulf
రష్యా ప్రధాని పుతిన్ తో భారత్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముఖాముఖి..

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి రాబోయే కాలంలో కొన్ని పెద్ద మలుపులు చూడవచ్చు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల రష్యా పర్యటన అనంతరం ఉక్రెయిన్‌లో కూడా పర్యటించారు. భారతదేశం రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉన్న దేశం. భారత్ ను ఇరు దేశాలూ విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. అధ్యక్షుడు పుతిన్‌తో అజిత్ దోవల్ క్లోజ్డ్ డోర్ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దోవల్, పుతిన్ ముఖాముఖి కూర్చున్నారు. మోడీ అభ్యర్థన మేరకు జెలెన్స్కీతో భారత ప్రధాని భేటీ గురించి పుతిన్‌కు వివరించారు.

సాధారణంగా పుతిన్ ఇలా ఏ నాయకుడిని కలవరు. ఆయన ఇంత దగ్గరగా.. ఏ జాతీయ పెద్దలను కూడా కలవరు. అటువంటి పరిస్థితిలో, దోవల్‌తో ఆయనతో సమావేశం చాలా కీలకంగా భావిస్తున్నారు. ఈ సమావేశంలో దోవల్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే వీడియోలో ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్ గా చెబుతుంది. ఈ వీడియోలో ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన గురించి నేరుగా చెప్పారు.

కాగా.. ప్రధాని మోడీ జులైలో రష్యా వెళ్లారు. ఆగస్టు నెలలో ఉక్రెయిన్​కి వెళ్లి, ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీని కలిశారు. అనంతరం ఆగస్ట్​ 27న రష్యా అధ్యక్షుడు పుతిన్​కి ఫోన్​ కాల్​ చేశారు. ఈ కాల్​లో భాగంగా తన ఉక్రెయిన్​ పర్యటన గురించి పుతిన్​కి మోడీ వివరించినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని పుతిన్​కి మోడీ చెప్పారట. 'తన ఉక్రెయిన్​ పర్యటన గురించి పుతిన్​తో మోదీ మాట్లాడారు. చర్చలు, దౌత్య చర్యల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పారు. తద్వారా శాంతిని స్థాపించాలని పిలుపునిచ్చారు,' అని గతంలో పీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com