గాజాలో పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి..తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- September 13, 2024
రియాద్: గాజా స్ట్రిప్‌లో నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా ఇజ్రాయెట్ జరిపిన దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ బలగాల చర్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ దాడిలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA) ఉద్యోగులతో సహా అనేక మంది వ్యక్తులు మరణించారు. తక్షణ కాల్పుల విరమణ, నిరాయుధ పౌరులకు రక్షణ, అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిన కారణంగా గాజా స్ట్రిప్‌లో అపూర్వమైన మానవతా విపత్తుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని మరోసారి సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. రిలీఫ్ సౌకర్యాలు, సంస్థలు వారి కార్మికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టాలపై ఇజ్రాయెల్ ఉల్లంఘనల పరంపర కొనసాగుతుందని, దీనికి ముగింపు పలకడం కోసం ఒత్తిడి తేవాలని ప్రపంచ దేశాలను సౌదీ అరేబియా కోరింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..