యూకేలో ఆరోపణలు.. యూఏఈలో పిల్లల డాక్టర్ పై సస్పెండ్ వేటు..!

- September 13, 2024 , by Maagulf
యూకేలో ఆరోపణలు.. యూఏఈలో పిల్లల డాక్టర్ పై సస్పెండ్ వేటు..!

దుబాయ్: దుబాయ్ లో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ యాసర్ జబ్బార్ ను సర్వీసు నుంచి తొలగించారు. అతను పనిచేస్తున్న క్లెమెన్సీ మెడికల్ సెంటర్ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. CMC హాస్పిటల్ దుబాయ్ లో పనిచేసే వైద్యునికి సంబంధించిన దుష్ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన ఇటీవలి నివేదికల నేపథ్యంలో డాక్టర్ యాసర్ పై సస్పెండ్‌ వేటు వేసినట్టు CMC హాస్పిటల్ సీఈఓ డాక్టర్ అలియా అల్ మజ్రోయి తెలిపారు. తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారుల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.

బ్రిటన్ అల్ సఫాలోని ఆర్థోక్యూర్, మెడ్‌కేర్ ఆర్థోపెడిక్స్ మరియు స్పైన్ హాస్పిటల్ లో డాక్టర్ యాసర్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు, అందులో అనధికారికంగా అనేకమందికి ఆపరేషన్లు చేసాడని, అందులో చాలామంది పిల్లలు వివిధ సమస్యలతో బాధపడుతున్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించడంతో డాక్టర్ యాసర్ కార్యాకలాపాలు వెలుగులోకి వచ్చాయి.  కాగా, “డాక్టర్ యాసర్ జబ్బార్ ఇప్పటి వరకు మెడ్‌కేర్‌లో ఏ రోగిని సంప్రదించలేదు లేదా శస్త్రచికిత్స చేయలేదు. అతను ఆర్థోక్యూర్‌లో ఎక్స్‌టర్నల్ కన్సల్టెంట్, ఆర్థోక్యూర్ సర్జికల్ విభాగంలో తమతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. ”అని సదరు హాస్పిటల్ స్పష్టం చేసింది.  

అయితే, డాక్టర్ యాసెర్ కేవలం ఏడు నెలల క్రితం ఆర్థోక్యూర్‌లో చేరారు. ఇప్పుడు తొలగించబడిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మాత్రం "20 సంవత్సరాలకు పైగా విస్తృతమైన క్లినికల్ అనుభవం" ఉన్నట్టుగా పేర్కొన్నారు.  దుబాయ్‌లో జరిగిన 10వ వార్షిక మెనా ఇంటర్నేషనల్ ఆర్థోపెడిక్ కాంగ్రెస్‌లో అతను మాట్లాడాల్సి ఉండగా.. తాజా చర్యలతో స్పీకర్ల జాబితా నుండి అతని పేరును తొలగించారు. 

ఆరోపణలు ఇవే

డాక్టర్ యాసెర్ 2017 నుండి 2023 చివరి వరకు బ్రిటన్ లోని గ్రేట్ ఒర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ లో ప్రాక్టీస్ చేసారు. అతను 700 కంటే ఎక్కువ కేసుల అత్యవసర ఆపరేషన్లను నిర్వహించారు. కాగా, ఇప్పటివరకు పరిశీలించిన 39 కేసుల్లో 22 మంది చిన్నారులు వివిధ సమస్యలతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి తెలిపింది. జూన్ 2022లో డాక్టర్‌పై మొదట ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిపై 11 నెలల పాటు వేతనంతో సెలవు ప్రకటించారు. ఈ క్రమంలో అతను సెప్టెంబర్ 2023లో రాజీనామా చేశాడు. అయితే, అతను యూఏఈకి ఎప్పుడు వచ్చాడు.. హాస్పిటల్ లో చేరి ఇక్కడ ఏవైనా శస్త్రచికిత్సలు చేసాడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com