అబుదాబిలో జరిమానాల పై 25% తగ్గింపు..!

- September 13, 2024 , by Maagulf
అబుదాబిలో జరిమానాల పై 25% తగ్గింపు..!

యూఏఈ: అబుదాబిలో పబ్లిక్ అప్పియరెన్స్ ఉల్లంఘనల జరిమానాలపై 25శాతం తగ్గింపు ప్రకటించారు.  కొత్త నిర్ణయం మునిసిపల్ ఇన్‌స్పెక్టర్లు పబ్లిక్ అప్పియరెన్స్ ఉల్లంఘనలను గుర్తించడానికి, నేరస్థులకు తెలియజేయడానికి, వాటిని పరిష్కరించే అవకాశాన్ని అందిస్తుంది. ఉల్లంఘన జారీ చేసిన వారంలోపు అప్పీల్ చేయడానికి ఉల్లంఘించిన వారికి హక్కు ఉంటుంది.  పదేపదే ఉల్లంఘిస్తే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, అపరాధికి ఎక్కువ జరిమానా విధించబడుతుందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోపు ఉల్లంఘనలను పరిష్కరించడంలో విఫలమైన వారికి అదే జరిమానా వర్తిస్తుంది.

ఉల్లంఘన రకాలు..పరిష్కార మార్గాలు:

1. పబ్లిక్ అప్పియరెన్స్

ఎ. భవన నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వలన అది ప్రజా భద్రతకు ముప్పు కలిగిస్తుంది. దాని రూపాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది

బి. అనుమతి లేకుండా కార్ పార్కింగ్ షేడ్స్‌ను అమర్చడం

సి. జెండాలు లేదా బ్యానర్ల అక్రమ నిర్వహణ

డి. సంస్థలు, వాణిజ్య ప్రాంగణాల్లో తగిన వ్యర్థ కంటైనర్లను అందించడంలో విఫలం

ఇ. భవన డెకోరేషన్

f. పైకప్పులు, బాల్కనీలు లేదా నివాస ప్రాపర్టీల మధ్య ఉన్న మార్గాలపై వ్యర్థాల నిల్వ

2. పబ్లిక్ స్పేస్ ప్రిసర్వేషన్

a. నిర్మాణ లేదా వ్యవసాయ వ్యర్థాలను అనుమతి లేని చోట పారవేయడం

బి. రహదారి డైరెక్షన్స్ ను పాటించకపోవడం

సి. పచ్చని ప్రాంతాలకు నష్టం చేయడం

డి. పబ్లిక్ ఆస్తులను పాడు చేయడం

ఇ. పండ్లు లేదా పువ్వులు తీయడం

f. వ్యక్తిగత వ్యర్థాలను పారవేయడం

3. బహిరంగ ప్రదేశాల్లో ఆటంకాలు సృష్టించడం

a. బహిరంగ ప్రదేశాలలో అడ్డంకులు

బి. అధిక శబ్దాన్ని సృష్టించడం

సి. అంతరాయం కలిగించే లైటింగ్‌ని ఉపయోగించడం

డి. పర్మిట్ లేకుండా ప్రింటెడ్ మెటీరియల్స్ పంపిణీ, లేదా పోస్ట్ చేయడం

ఇ. అనధికార ప్రదేశాల్లో స్మోకింగ్  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com