ఆసియా మహిళ అక్రమ రవాణా..ఇద్దరు నిందితులపై విచారణ..!

- September 13, 2024 , by Maagulf
ఆసియా మహిళ అక్రమ రవాణా..ఇద్దరు నిందితులపై విచారణ..!

మనామా: మానవ అక్రమ రవాణా ఆరోపణలపై విచారణకు ఇద్దరు అనుమానితులను రిఫెరల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. అనుమానితులు ఒక ఆసియా మహిళను బందీగా ఉంచి, అనైతిక చర్యలకు ఉపయోగించుకున్నారని కేసులు నమోదు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 22 నమోదైనట్టు వెల్లడించింది. కేసుకు సంబంధించి పోలీసు నివేదికను స్వీకరించిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన దర్యాప్తును ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. అనుమానితులు  ఒక క్రిమినల్ గ్రూపుగా ఏర్పడి ఉపాధి హామీతో బాధితురాలిని బహ్రెయిన్‌కు రప్పించారని తెలిపింది. బెదిరింపుల ద్వారా ఆమెను వ్యభిచారంలోకి నెట్టారని ఆరోపించారు. బాధితురాలు తన రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా వారు  పోలీసులను అప్రమత్తం చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com