మూడు రోజులుగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు
- September 13, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో మూడు రోజులుగా పౌర సేవలు నిలిచిపోయాయి. పోర్టల్ పనిచేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం మొదలుకొని స్కాలర్షిప్ వరకు ఇలా ప్రతి అవసరానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవ కేంద్రానికి వెళ్లక తప్పదు. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తరువాతే సంబంధిత కార్యాలయాల నుంచి ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయి. ఈ సర్టిఫికెట్లు కూడా మీ సేవ కార్యాలయాల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ దాదాపు మూడు రోజులుగా నిలిచిపోయింది. దీంతో ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు చెప్పులరిగేలా ఈ సేవల చుట్టూ తిరుగుతున్నారు.
కొన్ని కేంద్రాలను నిర్వాహకులు మూసి వేసేశారు. ఓ వైపున కొన్ని స్కాలర్షిప్ దరఖాస్తులకు చివరి తేదీ ముగుస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సంబంధిత రికార్డులు, ఇతరాత్ర అవసరాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు రెవెన్యూ కార్యాలయాల నుంచి తీసుకోవాల్సిన ధ్రువీకరణ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఉదయం, సాయంత్రం మీ సేవల చుట్టూ తిరగడమే సరిపోతుందని, దయచేసి సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పాలని బాధితులు వేడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఎదురుకావడంతో మీ సేవ కేంద్రాలు అన్ని కూడా సేవలందించలేకపోతున్నాయి. ప్రధాన సర్వర్లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయని, మరో రెండు రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









