వృద్ధుల హక్కులను కాలరాసే వారిపై భారీ జరిమానాలు..!!
- September 14, 2024
జెనీవా: వృద్ధుల మానవ హక్కులపై స్వతంత్ర నిపుణుడి నివేదికను GCC దేశాలు అంగీకరించాయి. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని ఖతార్ శాశ్వత ప్రతినిధి HE డా. హెంద్ అబ్దుల్రహ్మాన్ అల్ ముఫ్తా.. GCC తరపున జెనీవాలో మానవ హక్కుల మండలి 57వ సెషన్లో భాగంగా ఈ మేరకు ప్రకటన చేశారు. వృద్ధులకు కచ్చితమైన పర్యవేక్షణ ప్రమాణాలను నిర్ధారించడం అత్యవసరమన్నారు. వారి ఆర్థిక, చట్టపరమైన హక్కులకు తీవ్రమైన చిక్కులను కలిగించే ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. వృద్ధులపై దోపిడీ, వివక్షను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వృద్ధుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించాలని కోరారు. GCC హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్‌తో సహా అన్ని జాతీయ సామూహిక చట్టాలు వృద్ధుల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..