ఒమన్ లో 9.3% పెరిగిన ప్రయాణీకుల సంఖ్య..!
- September 15, 2024
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా జూలై 2024 నాటికి ప్రయాణికుల సంఖ్య 9.3 శాతం పెరిగింది. 63,219 విమానాల్లో 8,478,548 మంది ప్రయాణికులు ప్రయాణించారు. జూలై 20 నాటికి 59,778 విమానాల్లో 7,757,629 మంది ప్రయాణించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు తెలియజేశాయి. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య గత జూలై చివరి నాటికి 7,571,148 మందికి చేరుకుంది. 8.9 శాతం పెరుగుదల నమోదైంది.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చి వెళ్లే విమానాలలో 51,535 అంతర్జాతీయ విమానాలు, 6,948,193 మంది ప్రయాణీకులు నమోదు కాగా, ఇందులో 4,963 దేశీయ విమానాలు, 621,955 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య 827,486 మంది ప్రయాణీకులకు చేరుకుంది. జూలై 2023 ముగింపుతో పోలిస్తే ఇది 10.3 శాతం పెరిగింది. వారు 5,975 విమానాల్లో(3.6 శాతం పెరుగుదల) ప్రయాణించారు. సలాలా విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ విమానాల సంఖ్య 3,088 విమానాలకు చేరుకుంది. 392,098 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. దేశీయ విమానాల సంఖ్య 2,887 విమానాలకు చేరుకుంది.435,388 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. సోహార్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 384 విమానాల్లో 45,126 మంది ప్రయాణికులకు చేరుకోగా, దుక్మ్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 362 విమానాల్లో 34,788 మంది ప్రయాణికులకు చేరుకుంది.
తాజా వార్తలు
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు









