వీసా నియంత్రణలను కఠినతరం చేసిన బహ్రెయిన్..!!
- September 15, 2024
మనామా: పర్యాటక వీసాలు, వర్క్ పర్మిట్లతో సహా అన్ని వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లపై నియంత్రణలను కఠినతరం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీసాలను పొందడం లేదా మార్చడం, వ్యాపార సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిరోధించడమే లక్ష్యంగా కఠినమైన నిబంధనలను రూపొందించనున్నట్లు తెలిపింది. "బహ్రెయిన్ ఎంట్రీ వీసా నిర్ణయంలోని ఆర్టికల్ 4 ప్రకారం, సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చకూడదన్న కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఇది అవసరమైతే వీసా జారీ చేయడానికి ముందు ఇమ్మిగ్రేషన్ అధికారులు బహ్రెయిన్ గ్యారంటర్‌ను కోరడానికి అనుమతిస్తుంది. " తెలిపింది. 250 బహ్రెయిన్ దినార్ల రుసుముతో సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా లేదా కుటుంబ పునరేకీకరణ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని అనుమతించేటప్పుడు, గ్యారంటర్ లేకుండా సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిరోధించడం ఈ నిర్ణయం లక్ష్యం అని పేర్కొన్నారు. విజిటింగ్ ప్రయోజనాల కోసం మంజూరు చేసిన బహ్రెయిన్‌కు ప్రవేశ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిషేధించే ముసాయిదా చట్టాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వం పార్లమెంటును కోరిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!







