బాల్కనీ నుండి కిందపడ్డ సౌదీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. పరిస్థితి విషమం..!!
- September 15, 2024
దుబాయ్: సౌదీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఫహద్ అల్ మువాలాద్ సెప్టెంబర్ 12న యూఏఈ విహారయాత్రలో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ లోని ఇంటి బాల్కనీ నుండి పడిపోవడంతో తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నాడు. అతను రెండవ అంతస్తులోని బాల్కనీ నుండి కిందపడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని దుబాయ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. అల్ మువాలాద్ అల్ షబాబ్ ఫుట్‌బాల్ క్లబ్‌కు వింగర్, సౌదీ జాతీయ జట్టులో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఫహద్ త్వరగా కోలుకోవాలని క్రీడా మంత్రి, ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, సౌదీ ఫుట్‌బాల్ ఫెడరేషన్, అబుదాబిలోని సౌదీ ఎంబసీ, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆకాక్షించారు. అల్ మువాలాద్ సౌదీ అరేబియా తరఫున 74 మ్యాచులు ఆడి, 17 గోల్స్ సాధించాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!







