బిజినెస్ బేలో భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి..!!

- September 16, 2024 , by Maagulf
బిజినెస్ బేలో భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి..!!

దుబాయ్: బిజినెస్ బేలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. ఆమె నివసించిన ఎస్కేప్ టవర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న సెకండ్ హోమ్ కేఫ్ పక్కన RTA కార్ పార్క్ సమీపంలో ఉదయం 5 గంటలకు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. 38 అంతస్తుల భవనంలోని బాల్కనీ నుంచి ఆమె పడిపోయిందని భావిస్తున్నారు. ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మహిళ మృతికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com