భారత్ వ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
- September 17, 2024
దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలు మరోసారి నిలిచిపోయాయి. సెప్టెంబర్ 17 మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై నుండి ఈ అంతరాయం ప్రారంభమై..
దేశంలోని అన్ని నగరాల్లో Jio డౌన్ అయింది. అంతకుముందు మే, జూన్ 2024లో కూడా ముంబైలో జియో సేవలు నిలిచిపోయాయి. జియో డౌన్ కావడంపై వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు కంపెనీ నుండి ఎటువంటి ఖచ్చితమైన పరిష్కారం, హామీ రాలేదు.
ముంబై అంతటా జియో సేవలు నిలిచిపోయాయని సోషల్ మీడియాలో వినియోగదారులు పేర్కొంటున్నారు. కొన్ని గంటలుగా నెట్వర్క్ సమస్య ఉందని వెల్లడించారు. చాలా మంది వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్ సేవలపై కూడా ఫిర్యాదు చేశారు. అంతరాయాన్ని ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ కూడా Jio అంతరాయాన్ని ధృవీకరించింది. డౌన్‌డెటెక్టర్ మ్యాప్ ప్రకారం.. న్యూఢిల్లీ, లక్నో, నాగ్‌పూర్, కటక్, హైదరాబాద్, చెన్నై, పాట్నా, అహ్మదాబాద్, కోల్‌కతా, గౌహతి వంటి నగరాల్లో Jio సేవలు నిలిచిపోయాయి.
కేవలం 1 గంటలో 10 వేల మందికి పైగా డౌన్‌డెటెక్టర్‌పై ఫిర్యాదులు చేశారు. సిగ్నల్ లేదని 67 శాతం మంది, మొబైల్ ఇంటర్నెట్పై 20 శాతం మంది, జియో ఫైబర్‌పై 14 శాతం మంది ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..