అల్-ఖోరాయేఫ్.. మైనింగ్ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం..!

- September 17, 2024 , by Maagulf
అల్-ఖోరాయేఫ్.. మైనింగ్ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం..!

రియాద్: సౌదీ అరేబియాలోని పారిశ్రామిక, మైనింగ్ రంగాలలో పనిచేస్తున్న 90% కంపెనీలు చిన్న మధ్యతరహా పరిశ్రమలేనని పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్-ఖోరాయేఫ్ ధృవీకరించారు. జనరల్ అథారిటీ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ “మోన్‌షాత్” నిర్వహించిన “పరిశ్రమ మరియు మినరల్ రిసోర్సెస్ పయనీర్స్” కార్యకలాపాల్లోని డైలాగ్ సెషన్‌లో అల్-ఖోరాయెఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.   మైనింగ్ రంగంలో, గనులను సంరక్షించడంలో ఆధునాతన సాంకేతికతలను ప్రవేశపెట్టినట్టు వివరించారు. దాంతో పర్యావరణం, భద్రత,  ఉత్పాదకత ఉన్నత స్థాయిలో ఉంటుందన్నారు. నేడు మైనింగ్ రంగం పారిశ్రామికవేత్తలకు గొప్ప అవకాశాలను కలిగి ఉందని, ఈ రంగంలో అందుబాటులో ఉన్న ఈ అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక మైనింగ్ రంగాలలో పారిశ్రామికవేత్తలు చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులు ప్రయోజనం పొందేందుకు మంత్రిత్వ శాఖ పనిచేసిన 100 కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఉన్నాయని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com