బహ్రెయిన్‌లో నకిలీ యూఎస్ డాలర్ల చెలామణి..వ్యాపారవేత్తకు జైలుశిక్ష..!!
- September 17, 2024
మనామా: నకిలీ యూఎస్ డాలర్లను దేశంలో చెలామణి చేసిన కేసులో బహ్రెయిన్ వ్యాపారవేత్తకు ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా నకిలీ కరెన్సీని చెలామణి చేయాలనే ఉద్దేశ్యంతో బహ్రెయిన్‌లోకి తీసుకువచ్చాడని కోర్టు నిర్ధారించింది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. వ్యాపారవేత్త నకిలీ $500 బిల్లులతో బహ్రెయిన్‌లోకి ప్రవేశించి, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాప్‌కు వెళ్లాడు. అతను $750 విలువైన ఐదు పెర్ఫ్యూమ్లను కొనుగోలు చేశాడు. నకిలీ కరెన్సీని ఉపయోగించి $200కి సిగరెట్లను కొనుగోలు చేశాడు. క్యాషియర్‌కు అనుమానం వచ్చి ఎయిర్‌పోర్టు సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు, డ్యూటీ ఫ్రీ షాప్ మేనేజర్ అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డాలర్లు నకిలీవని తనకు తెలియదని చెప్పాడు. కానీ, హై క్రిమినల్ కోర్ట్ తన తీర్పులో నిందితుడు నకిలీ కరెన్సీని ఉద్దేశపూర్వక చెలామణి చేయడానికి ప్రయత్నించాడని నిర్ధారించింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ, ఇతర వస్తువులను జప్తు చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..