లారెన్స్ రాఘవ హీరోగా ఆ సెన్సేషనల్ యాక్షన్ మూవీ రీమేక్.?
- September 18, 2024
ఇటీవలే ఓటీటీలో రిలీజైంది ఓ యాక్షన్ మూవీ. పేరు ‘కిల్’. బాలీవుడ్ మూవీ అది. నటీనటులు, వివరాలు గట్రా పక్కన పెడితే, సినిమాలో యాక్షన్ చూసిన ఓటీటీ ఆడియన్స్ అబ్బా.! ఇదేం యాక్షన్‌రా బాబూ.. అనుకోకుండా వుండలేకపోయారు.
ఆ రేంజ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ కట్ చేశారు ఈ సినిమాలో. అంతా ఓ ట్రైన్‌లో జరిగే స్టోరీనే. తన ఫ్యామిలీని దుండగుల నుంచి సర్వైవ్ చేసుకునే హీరో కథ ఇది.
ఎటు చూసినా రక్తపాతమే. స్లో అండ్ స్టడీగా స్టార్ట్ అయ్యి.. భీభత్సమైన యాక్షన్‌తో నెక్స్‌ట్ లెవల్, నెక్స్‌ట్ లెవల్.. అంటూ ఎండ్ అవుతుంది. ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనాల నోళ్లలో బాగా నానింది ఈ సినిమా.
ఈ ముచ్చట ఇప్పుడెందుకంటారా.? ఈ సినిమాని సౌత్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. తమిళ నటుడు, డాన్స్ కొరియోగ్రఫర్, నిర్మాత, దర్శకుడు అయిన లారెన్స్ రాఘవ ఈ యాక్షన్ సినిమాని రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే, రాఘవ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం లేదు. ఇందులో నటిస్తున్నాడట! తెలుగులో ‘రాక్షసుడు’ సినిమాని తెరకెక్కించిన రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా అనౌన్స్‌మెంట్ జరిగిన ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







